ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్‌

Sep 7 2025 7:48 AM | Updated on Sep 7 2025 7:48 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్‌

భూపాలపల్లి అర్బన్‌: విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ్ణన్‌ చిత్రపటానికి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కోట రాజబాబు, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మితో కలిసి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తరువాత స్థానం ఉపాధ్యాయులదేనన్నారు. గురువును మించిన దైవం ఈ లోకంలో లేదన్నారు. విద్యాబోధనలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయులను విదేశాలకు పంపి ఆధునిక విద్యా విధానాలపై అధ్యయనం చేయించి అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 11వేల ఉపాధ్యాయుల నియామకాలు, పెండింగ్‌ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో వాహనాల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులని అన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి, సత్కరించడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతమైన ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ, విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ కోట రాజబాబు, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 33 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్‌, సెక్టోరియల్‌ అధికారులు లక్ష్మణ్‌, రాజగోపాల్‌, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఉపాధ్యాయులకు సన్మానం

ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్‌1
1/1

ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement