
గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి
భూపాలపల్లి రూరల్: విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా భూపాలపల్లి మంజూర్‌నగర్‌లోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవీ ఆలయంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులను అందించాలని విఘ్నేశుడిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉన్నారు.
దగ్ధమైన ఇల్లు పరిశీలన
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని మహబూబ్‌పల్లిలో ప్రమాదవశాత్తు దగ్ధమైన కొమ్ము ప్రమీలకు సంబంధించిన ఇల్లును ఎమ్మెల్యే సత్యనారాయణరావు పరిశీలించారు.