
యూరియా ఇబ్బందులు తీర్చాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి: రైతుల యూరియా ఇబ్బందులు తీర్చాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థతతోనే యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, నాయకులు కోడారి రమేష్, జోరుక సదయ్య, నెనకంటి ప్రభాకర్‌రెడ్డి, పెంతల రాజేందర్, రాములు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.