
యూరియా కోసం అన్నదాతల ధర్నా
కాటారం: మన గ్రోమోర్‌లో నిల్వ ఉన్న యూరియా పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో మన గ్రోమోర్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడూతూ మన గ్రోమోర్‌లో యూరియా నిల్వ ఉన్నా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. స్టాక్‌కు సంబంధించి డీఓ ఆర్డర్ రాలేదనే సాకుతో యూరియా ఇస్తలేరని అన్నారు. యూరియా లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలా నికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదా యించారు. ఏఓ పూర్ణిమ, మన గ్రోమోర్ మేనేజర్‌తో మాట్లాడి రైతులకు యూరియా పంపిణీ చేయాలని సూచించడంతో అందజేశారు.