
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడం సిగ్గుచేటు
చిట్యాల: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన ధర్నా చేపట్టారు. అనంతరం చేతకాని ప్రభుత్వానికి మేలుకోలుపాలని వినాయకుడి విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్‌పై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు సరిపడా యూరియా అందించకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్నరోజుల్లో ప్రజలు బుద్దిచెబుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏరుకోండ రాజేందర్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, సురేష్, రమణాచారి, సరోజన, శ్రీదేవి, వెంకటేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు
గండ్ర జ్యోతి