
కార్మికుల సమస్యలను విస్మరించిన సంఘాలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలోని కొన్ని సంఘాలు కార్మికుల సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భారత మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో బుధవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్మిక పోరాట బహిరంగ సభలో రాజేందర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. కార్మిక సంఘాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.43వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు. సింగరేణిలో రెగ్యులర్ కార్మికుల సంఖ్య లక్షకు పైగా ఉండగా నేడు 39 వేలకు పడిపోయిందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు పెంచుతు కోల్ ఇండియా వేతనాలను సింగరేణిలో అమలు చేయడం లేదన్నారు. సింగరేణిలో న్యాయబద్దంగా మెడికల్‌బోర్డు నిర్వహించడం లేదని డ బ్బులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రమే అన్‌ఫిట్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు వేరేప్రాంతాలకు కేటాయిస్తున్నారని తెలిపా రు. ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌లు బానిసలుగా విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. గత ఆర్ధిక సంవత్సరం లాభాల్లో నుంచి కార్మికులు 40శాతం వాటా కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులు మాధవనాయక్, సత్త య్య, కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, సారంగపాని, పవన్‌కుమార్, రాజారెడ్డి, బీజేపీ నాయకులు కీర్తిరెడ్డి, అరూరి రమేష్, సీతారామ్‌నాయక్, వేణుగోపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, నిశిధర్, సుజేందర్, నర్సింగరావు, మల్లేష్ పాల్గొన్నారు.
ఎంపీ ఈటల రాజేందర్