
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కేటీకే 5వ గనిలో జరిగిన నిరసన కార్యక్రమానికి జోగు బుచ్చయ్య హాజరై మాట్లాడారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్‌మెన్, ఈిపీ ఆపరేటర్లకు సర్ఫెస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి 14వ తేదీన ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు, సంపత్ రావు, రాజేష్ ఠాకూర్, రవి, కిరణ్, అశోక్, అజీమ్, శ్రీనివాస్, నవీన్, కుమార్, రాము, సమ్మయ్య పాల్గొన్నారు.