
‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. 79వ స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో శుక్రవారం టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకలకు వచ్చే అతిథులు కూర్చోవడానికి వీలుగా షామియానాలు, కుర్చీలు, బారికేడింగ్, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, పాఠశాలల విద్యార్థులతో దేశ భక్తికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు డీఆర్‌డీఓకు ఈ నెల 11వ తేదీ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమం నిర్వహణలో ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మువ్వన్నెల జెండా ఎగరేయాలి
రేగొండ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని చాటుతుందన్నారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ఈ కార్యక్రమంతో జాతీయ ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గాలిఫ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పెండ్యాల రాజు, మండల ప్రధాన కార్యదర్శులు తూర్పాటి మల్లేష్, దయ్యాల కిరణ్, నాయకులు రమేష్, రత్నాకర్, శివరాజ్. సంతోష్ పాల్గొన్నారు.

‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఏర్పాట్లు