
సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం
భూపాలపల్లి రూరల్: సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం నడుస్తుందని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు నోరుమెదపడం లేదన్నారు. సంఘాలు కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, నామాల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్‌రెడ్డి, రాళ్లబండి బాబు, నరసింహారెడ్డి పాల్గొన్నారు.