
స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు
కాటారం: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కాటారం మండలం రేగులగూడెంలో గ్రామపంచాయతీలో నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుందని మహిళలు ఖా ళీ బిందెలతో నిరసన తెలిపిన విషయం విదితమే. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్, అదనపు కలెక్టర్ రేగులగూడెం చేరుకొని గ్రామపంచాయతీ సమీపంలోని కాలనీ మహిళలతో మాట్లాడారు. తా గునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించి సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారుల వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి క్రిష్ణవేణి ఉన్నారు.
సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్