
వసతి గృహాలపై నిర్లక్ష్యం వద్దు
భూపాలపల్లి రూరల్: వసతి గృహాల్లో సమస్యలు లేకుండా చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నా రు. గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), హాస్టల్స్, వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల భోజన సౌకర్యాలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. విద్యార్థులకు విద్యతో పాటు, హాస్టల్ సదుపాయాలు, ఆహారం, ఆరోగ్య పరిరక్షణను సమర్థంగా అందించడం తమ బాధ్యత అని గుర్తు చేశారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని, వారి ఆ రోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబో మని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు