ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

Aug 9 2025 5:50 AM | Updated on Aug 9 2025 5:50 AM

ఘనంగా

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలు

వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు

ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులు

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి అర్బన్‌: డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌కు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సి పాల్‌, స్పెషల్‌ ఆఫీసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మండలాల పరిధిలోని ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు అందించాలని సూచించారు.

ఓసీ–2ను అడ్డుకుంటాం..

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌–2లో వ్యవసాయ భూములు కోల్పోయిన ఫక్కీర్‌గడ్డ, ఆకుదారివాడలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని భూనిర్వాసితులు బుర్ర మనోజ్‌, రమేష్‌, రాజయ్య, రవి కోరారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పిస్తామని మాయమాటలతో మభ్యపెడుతుందన్నారు. సింగరేణి సీఎండీ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 20 తర్వాత ఓసీ పనులు అడ్డుకుంటామన్నారు.

డీవైఎఫ్‌ఐ జిల్లా

అధ్యక్షుడిగా దేవేందర్‌

భూపాలపల్లి రూరల్‌: డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడిగా గుడికందుల దేవేందర్‌, కార్యదర్శిగా భూక్య నవీన్‌ను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రామికభవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వెంకటేష్‌ మాట్లాడారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృత పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భగత్‌సింగ్‌, చేగువేరా ఆశయస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

క్షుద్రపూజల కలకలం

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్‌ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆ లయానికి వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

మరోసారి పూజారుల

సమావేశం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ అధికారులు, పూజారులు శుక్రవారం మేడారంలో మరోసారి సమావేశమయ్యారు. ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు పూజారులు సమావేశమయ్యారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేసే విషయంపై పూజారుల అభిప్రాయాలను దేవాదాయశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పూజారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్‌కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతోంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతీ సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు.

నేడు

రక్షా బంధన్‌

అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్‌. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్‌) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

బంధాలకు విలువనివ్వాలి..

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.

అన్న జ్ఞాపకంగా..

నల్లబెల్లి: నాకు ఇప్పుడు 72 ఏళ్లు. నా చిన్నతనం నుంచి అన్న, తమ్ముడికి రాకిట్లు కట్టేదాన్ని. అన్న మల్లయ్య 28 ఏళ్ల క్రితం అనారోగ్యంతో సచ్చిపోయిండు. ఇప్పడు తమ్ముడు కృష్ణయ్యతో పాటు అన్న కొడుకు శ్రీనివాస్‌కు రాఖీ కడతన్న. ఈ పండుగ ఎంతో సంబరంగా అనిపిస్తుంది. తోడబుట్టినోళ్లం ఒకదగ్గర కలుసుకుని సంతోషంగా గడుపుతాం. ఎక్కడున్నా రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్త.

– నాగపురి లక్ష్మి, నల్లబెల్లి

అక్కలంటే అమితమైన ప్రేమ..

జనగామ: జనగామలోని వీవర్స్‌ కాలనీకి చెందిన కాముని ఉపేంద్ర, వైట్ల కళమ్మ, చింతకింది సక్కుబాయి, చెన్నూరి రేణుక అక్కాచెల్లెళ్లు. వారి సోదరుడు గజ్జెల వెంకటేశ్‌కు ఆరు దశాబ్దాలుగా రాఖీ కడుతూ రాఖీ బంధాన్ని గుర్తుచేస్తున్నారు. మూడు రోజుల ముందుగానే రాఖీలు కొని, ఒక్కరోజు ముందుగా వెళ్తారు. తమ్ముడికి రాఖీ కడతారు.

కష్టసుఖాల్లో

పాలుపంచుకుంటాం..

వెంకటాపురం(ఎం): మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఏ టా హనుమకొండకు వెళ్లి తమ్ముడు రాజ మౌళికి రాఖీ కడతాం. ఇప్పటికీ మా బంధం ఇలా నే కొనసాగుతోంది. మా కష్టసుఖాల్లో తమ్ము డు, తమ్ముడి కష్టసుఖాల్లో మేం పాలుపంచుకుంటాం. – నిర్మల, రాజమౌళి అక్క

వీరు కూడా ఆచారం

పాటిస్తున్నారు..

హసన్‌పర్తి: ఇక్కడ ముస్లింలు కూడా రాఖీ వేడుకలను నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా ఓ ముస్లిం కుటుంబంలో ఈ ఆచారం కొనసాగుతోంది. హసన్‌పర్తికి చెందిన మహ్మద్‌ ఖాజానయీమొద్దీన్‌ సోదరి అమీనాషాహిన్‌ స్వస్థలం హనుమకొండ. రాఖీ పండుగను పురస్కరించుకుని ఏటా ఆమె ఎక్కడున్నా హసన్‌పర్తికి వచ్చి అన్నకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. రాఖీ తోబుట్టువుల బంధాన్ని బలోపేతం చేస్తుందని అమీనాషాషిన్‌ అంటున్నారు.

45 ఏళ్లుగా..

క్రమం తప్పకుండా..

రేగొండ: 45 ఏళ్లుగా ఓ అక్క తన తమ్ముడికి క్రమం తప్పకుండా రాఖీ కడుతూనే ఉంది. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన వన్నాల లింగయ్య, రాంబాయిలు అక్కాతమ్ముళ్లు. రాంబాయిని అదే మండలంలోని కొనరావుపేట గ్రామానికి ఇచ్చి వివాహం చేశారు. రాంబాయి ఏటా రాఖీ కడుతూ అక్కాతమ్ముళ్ల బంధాన్ని చాటుకుంటోంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ్ముడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్నిస్తుందని రాంబాయి తెలుపుతోంది.

న్యూస్‌రీల్‌

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు1
1/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు2
2/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు3
3/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు4
4/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు5
5/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు6
6/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు7
7/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు8
8/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు9
9/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు10
10/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు11
11/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు12
12/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు13
13/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు14
14/14

ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement