
అడిషనల్ ఎస్పీకి అతి ఉత్కృష్ట సేవా పతకం
భూపాలపల్లి అర్బన్: గత 34 సంవత్సరాలుగా పోలీస్‌శాఖలో ఉత్తమ సేవలందిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న నరేష్‌కుమార్ అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. పోలీసుశాఖలో 1991లో ఎస్సైగా చేరిన నరేష్‌కుమార్ 2006లో సీఐగా, 2017లో డీఎస్పీగా ప్రమోషన్ పొంది, మహబూబాబాద్, మామునూర్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. 2023లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది, ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో అడిషనల్, డీసీపీగా, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంతమైన ఇన్వెస్టిగేషన్‌తో నిందితులకు జీవిత ఖైదీశిక్ష పడే విధంగా కృషి చేయడంతో నరేష్‌కుమార్‌ను ప్రభుత్వం ఈ పతకానికి ఎంపిక చేసింది. ఇంతకు ముందు నరేష్‌కుమార్ సేవా పతకం, కఠిన సేవా పతకంతోపాటు, ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్‌ను అందుకున్నారు. తాజాగా అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై న అదనపు ఎస్పీ నరేష్ కుమార్‌ను ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు.