
గోరింట సంబురం
గోరింటాకు పండటంతో మురిసిపోతున్న మహిళలు
భూపాలపల్లి అర్బన్: ఆషాఢ మాసం అంటేనే ఆడపడుచులు అమితంగా ఇష్టపడే గోరింటాకు(మైదాకు) గుర్తుకొస్తుంది. ఈక్రమంలో ఈ నెలరోజులూ మహిళలు గోరింటాను చేతులకు పెట్టుకుని ఆనందపడుతారు. ఈనేపథ్యంలో జిల్లా కేంద్రంలోని హన్‌మాన్‌నగర్‌లో బుధవారం మహిళలు గోరింట పండగను ఘనంగా నిర్వహించకున్నారు. మహిళలు అందరూ ఒకే చోట చేరి గోరింటాకును తయారు చేసి చేతులకు పెట్టుకొని ఆనందంగా గడిపారు. వివిధ రకాల డిజైన్లను గోరింటాకుతో చేతులపై పెట్టుకొని మురిసిపోయారు.

గోరింట సంబురం