
ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదనే..
ఇద్దరు పిల్లలు చాలు...
పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న యు వతరం నేపథ్యంలో ఇద్దరు పిల్లలైతే చాలు అనుకుంటున్నాం. రానున్న కా లంలో జనాభా తగ్గుముఖం పడుతున్నందున ఒక్కరి కన్నా ఇద్దరైతే బాగుంటుంది. ముగ్గురు, అంతకన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఆర్థికంగా భారం పెరుగుతుంది. దీంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మేం ఇద్దరు పిల్లల కోసమే ప్లాన్ చేసుకున్నాం.
– చెమ్మాల మధుప్రియ, సుధీర్ దంపతులు,
కాళేశ్వరం
భూపాలపల్లి: తాతల కాలంలో ఐదారుగురు, మన తండ్రుల కాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగా ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలని కొత్త దంపతులు, వివాహానికి సిద్ధంగా ఉంటున్న వారంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేందుకు, ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు, విద్యా, ఆరోగ్యపరంగా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుత తరం ఒకరిద్దరు పిల్లలు మాత్రమే చాలంటున్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో జనాభా పెరుగుదల, కొత్త దంపతుల అభిప్రాయాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రోజుకు 10నుంచి 15మంది జననం...
జిల్లాలోని 12 మండలాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,60,000 జనాభా ఉంది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 10నుంచి 15ప్రసవాలు జరుగుతున్నాయి. నెలకు 350నుంచి 400మంది పిల్లలు జన్మిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. పిల్లలకు జన్మనిచ్చిన తల్లితండ్రుల్లో నూటికి 98శాతం మంది ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటుండగా, ఒకశాతం మగబిడ్డ కోసం వేచి చూస్తున్నట్లు, మిగిలిన ఒకశాతం ఒక బిడ్డ మాత్రమే చాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు, ఉరుకు పరుగుల జీవితం, భార్య, భర్త ఇద్దరూ పని చేస్తేనే ఇల్లు వెళ్లదీస్తున్న క్రమంలో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే చాలని యంగ్ కపుల్స్ అనుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా..
కుటుంబ పోషణలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదనే ఇద్దరు పిల్లలు చాలని అనుకున్నాం. ఇద్దరి కంటే ఎక్కువైతే విద్య, ఆరోగ్యం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు అని భావించాం. ఇద్దరు పిల్లలను పక్కా ప్లాన్ ప్రకారం హ్యాపీగా ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నాం.
– విజయ్‌సాయి, వేద, కొత్తపల్లిగోరి
ఒకరు లేదా ఇద్దరు చాలంటున్న
తల్లితండ్రులు
ముగ్గురు పిల్లలు అసలే వద్దంటున్న పరిస్థితి

ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదనే..

ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదనే..