
సమాజ భాగస్వామ్యం అవసరం
● జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్
కాళేశ్వరం: రేపటి పౌరులను తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయులతో పాటు సమాజ భాగస్వామ్యం అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. గురువారం మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి తనిఖీ చేశారు. హెచ్‌ఎం రాచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన దాతలు మల్లేశ్వరి, ఎర్ర దివాకర్ టై, బెల్టులను డీఈఓ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రేపటి తరానికి ఉపయోగపడే జాతి రత్నాలను తీర్చిదిద్దడంలో ఒక ఉపాధ్యాయులు కాకుండా విజ్ఞులు, విద్యావేత్తలు, ప్రముఖులు సమాజం ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ చల్లా కిషన్‌రెడ్డి, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.