
ఇద్దరితో సంతోషంగా ఉన్నాం..
వెంకటాపురం(ఎం): ప్రస్తుత కాలంలో రోజురోజుకూ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాం. అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇద్దరు పిల్లలను చదివించడానికి చాలా కష్టపడుతున్నాం. పిల్లల చదువుకోసం జిరాక్స్ సెంటర్, కిరాణం షాపు నడుపుతూ పిల్లల్ని చదివిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉంటే ఎంత కష్టపడినా వారిని ఉన్నతంగా చదివించలేము. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
– మోడెం శ్రీనివాస్, అనిత దంపతులు