
లింగ నిర్ధారణ నేరం
భూపాలపల్లి అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని చెప్పుడం చట్టరీత్యా నిషేధమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరికై నా లింగనిర్ధారణ సమాచారం తెలిస్తే 63032 39891ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చేయాలని, లేదా 104, 181, 1098, 100 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఎంసీహెచ్ పీఓ డాక్టర్ శ్రీదేవి, పీఓ డాక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు.