ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 1 2025 1:01 AM | Updated on Jun 1 2025 1:01 AM

ఆదివా

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

అదనపు ఎస్పీగా

బాధ్యతల స్వీకరణ

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీగా ఎ.నరేష్‌కుమార్‌ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ కిరణ్‌ ఖరేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కాగా నరేష్‌కుమార్‌ 1991లో ఎస్సైగా ఎంపికై ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు సీఐడీ విభాగంలో పని చేశారు. 2023లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది ఖమ్మం కమిషనరేట్‌లో పని చేస్తూ భూపాలపల్లికి బదిలీపై వచ్చారు.

ట్రైనింగ్‌ కిట్ల అందజేత

భూపాలపల్లి: సింగరేణి జీవీటీసీలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ పరిశీలించారు. అభ్యర్థులకు ట్రైనింగ్‌ కిట్లను అందజేసి, శిక్షణ కార్యక్రమంలో నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్‌ ల్యాండ్స్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లికి బస్‌ సౌకర్యం కల్పించాలి

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు ఆర్టీసీ బస్సు సర్వీస్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆర్టీసీ ఆర్‌ఎం విజయభానుకు సింగరేణి ఏరి యా అధికార ప్రతినిధి మారుతి శనివారం వినతిపత్రం అందించారు. అడ్రియాల ఏరియా నుంచి సింగరేణి కార్మికులు భూపాలపల్లి ఏరి యాకు రావడానికి సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ద్విచక్ర వా హనాలపై విధులకు వచ్చి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, రెండు జిల్లాల మధ్య సంబంధాలు ఎక్కువగా ఉ న్నట్లు వినతిలో పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సర్దుబాటు సరికాదు

భూపాలపల్లి అర్బన్‌: ఉపాధ్యాయ ఖాళీలను భ ర్తీ చేయకుండా ఉన్నటువంటి వారినే సర్దుబా టు చేయడం సరికాదని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలువే రు అశోక్‌, అయిత తిరుపతిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తూనే మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్యను కు దింపు చేయడం సరికాదన్నారు. కలెక్టర్లకు ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వులు విరమించుకోవా లని డిమాండ్‌ చేశారు. ప్రతీ తరగతికి ఒక్క ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

చిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్‌, జనగామ, మహా అంటే హైదరాబాద్‌ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్‌) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్‌ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి.

పరపతి సంఘం ద్వారా

సామాన్యుల విమానయానం

కల నెరవేర్చుకున్న రైతులు,

కూలీలు, వృత్తిదారులు

కుటుంబ సమేతంగా ఛార్‌ధామ్‌,

ఆగ్రా, కాశీ విహారయాత్రలు

దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు

విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్‌ధామ్‌యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది.

– గీసగోని రాజయ్య,

గీతకార్మికుడు

ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్‌ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది.

గాల్లో వెళ్తుంటే బాగుంది..

గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్‌ ఎక్కినం. ఛార్‌ధామ్‌ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది.

– రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల

అందరి కృషి..

పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్‌ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్‌ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్‌కు వెళ్లాం. ఛార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి.

– చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల

సెల్ఫీ తీసుకుని మురిసిపోయా..

గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్‌ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్‌యాత్రకు వెళ్దామనుకుంటున్నాం.

– కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల

పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్‌, ట్రావెల్స్‌ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్‌మెంట్‌ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు.

ఆలోచన వచ్చిందిలా..

గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్‌ధామ్‌, కాశీ టూర్‌, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఆరోజు ఏం జరిగిందంటే..!

2023 అక్టోబర్‌ 2న ఎన్‌ఐఏ ఉదయం నుంచి రాత్రి వరకు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట, హంటర్‌రోడ్డు, పైడిపల్లిలో తనిఖీలు నిర్వహించింది. మావోయిస్టు పార్టీకి అనుబంధ సంఘంగా ఉందని చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) మాజీ సభ్యురాలి ఇంటితో పాటు, ఆమె తల్లిగారింట్లో సోదాలు నిర్వహించారు. అలాగే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఇంట్లోనూ సోదాలు చేశారు. 2016లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్‌ నవత ఫొటోలను కూడా అధికారులు పరిశీ లించారు. అయితే ఆ సోదాల సందర్భంగా కూ డా ఎవరినీ ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోలేదు.

న్యూస్‌రీల్‌

పరపతి

సంఘాలు..

ఐకమత్యానికి

నాంది

ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే..

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20252
2/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20253
3/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20254
4/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20255
5/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20256
6/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20257
7/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 20258
8/8

ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement