కేయూకు సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలు | - | Sakshi
Sakshi News home page

కేయూకు సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలు

Jun 4 2025 1:27 AM | Updated on Jun 4 2025 1:27 AM

కేయూక

కేయూకు సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలు

కేయూ క్యాంపస్‌: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీలోని ఓల్డ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టరేట్‌ బిల్డింగ్‌లో సో షియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగం (రెగ్యులర్‌ కోర్సు) ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీకి తరలింది.. కానీ.. ఆ విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది జాప్యం జరిగింది. ఈనెల 2న యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వగా.. మంగళవారం సోషియాలజీ విభాగాన్ని ఓల్డ్‌ అడ్మిషన్ల డైరెక్టరేట్‌కు షిప్ట్‌ చేశారు. కాగా.. మంగళవారం అక్కడే సోషియాలజీ విభాగంలో ఫైనలియర్‌ విద్యార్థులు ఫేర్‌వెల్‌ పార్టీ నిర్వహించుకున్నారు.

కేయూకు ఎంస్‌డబ్ల్యూ..

హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో కొనసాగుతున్న మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ)ను కూడా కాకతీయ యూనివర్సిటీకి షిఫ్ట్‌ చేశారు. కాగా.. 2018లో నిర్మల్‌ పీజీ సెంటర్‌ నుంచి సోషియాలజీ కోర్సు యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ ఒకే విభాగంగా కొనసాగుతూ వస్తోంది. సోషియాలజీ విభాగంలో 90 మంది, ఎంఎస్‌డబ్ల్యూలో 120 మంది విద్యార్థులున్నారు. సోషియాలజీ విభాగంతోపాటే ఎంఎస్‌డబ్ల్యూను కొనసాగించాలని విద్యార్థులు, అధ్యాపకులు అప్పటి వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో చివరికి ఎంఎస్‌డబ్ల్యూను కూడా వర్సిటీ క్యాంపస్‌కు షిఫ్ట్‌ చేస్తూ కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ఈనెల 2న ఉత్తర్వులు జారీచేశారు. ఒకటి రెండురోజుల్లో ఎంఎస్‌డబ్ల్యూ విభాగం కూడా కేయూలోని ఓల్డ్‌ అడ్మిషన్ల డైరెక్టరేట్‌కే తరలించనున్నారు.

ఎంఎస్‌డబ్ల్యూ రావడం హర్షణీయం..

ఎప్పటి నుంచో సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ క్యాంపస్‌లో ఉండాలని అందరూ కోరుకున్నారు. ఎట్లకేలకు షిఫ్ట్‌ చేయడం హర్షనీయం. వీసీ, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు.

– ప్రొఫెసర్‌ స్వర్ణలత, సోషియాలజీ,

ఎంఎస్‌డబ్ల్యూ విభాగాధిపతి

ఓల్డ్‌ అడ్మిషన్స్‌ బిల్డింగ్‌లో అన్ని ఏర్పాట్లు

ఉత్తర్వులు జారీ చేసిన

వర్సిటీ అధికారులు

కేయూకు సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలు1
1/1

కేయూకు సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement