ఆధునిక పద్ధతులు అవలంబించాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడంతో పాటు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్, ఏడీఏ భూపాలపల్లి రమేశ్, జిల్లా ఉద్యానవన అధికారి సునీల్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు. అలాగే కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడెపాకలో భూలక్ష్మీ, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
క్రీడలు ప్రేమానురాగాలు పెంచుతాయి
చిట్యాల: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఏస్ ఆవరణంలో బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, సత్యం, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య, వెంకట్రామ్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, స్వామి, నాయకులు పాల్గొన్నారు.


