
పుష్కర ఏర్పాట్లు భేష్..
● ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లు భేష్‌గా ఉన్నాయని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌తో కలిసి విప్ కుటుంబ సమేతంగా సోమవారం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఏర్పాట్లు పరిశీలించి కలెక్టర్, అధికారులను అభినందించారు. విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కాళేశ్వర ముక్తీశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.