
సహకార సంఘాలతో ఉపయోగం
భూపాలపల్లి రూరల్: సహకార సంఘాలు మానవ జీవనానికి ఎంతో ఉపయోగపడతాయని జిల్లా సహకార సంఘం అధికారి వాల్యా నాయక్ అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 కార్యక్రమాల్లో భాగంగా సోమవారం టీఎన్‌జీఓ కార్యాలయంలో సహకార గృహ నిర్మాణ సంఘాల ప్రాథమిక సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వాల్యానాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సహకార స్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ సదస్సులో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, సహకార రిజిస్టార్ నాగనారాయణ, రాజు, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి దశరథ రామారావు, తదితరులు పాల్గొన్నారు.