
పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం
సరస్వతీనది పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం ఐదోరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రధాన పూజలు చేసి పితృదేవతలకు తర్పనాలు నిర్వహించారు. నదీమాతకు చీరె, సారెను సమర్పించారు. ముత్తయిదువ మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తులతో పుష్కరిని నిండిపోయి దర్శనమిచ్చింది. దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టు, ఖాదీ వస్త్రాలు, పిల్లల ఆటలు వస్తువులు, టెంట్‌సిటీలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పార్కింగ్ స్థలాలు, బస్టాండ్ నుంచి కొంతమంది ఆటలు, కాలినడకన తరలివస్తున్నారు.
80వేల మంది స్నానాలు
వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమంలోని సరస్వతీనదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తులు దర్శనానికి క్యూలైన్‌లో బారులుదీరారు. ఆలయంలో దర్శనాలు చేసుకున్నారు. సోమవారం ఒక్కరోజు 80వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. శని, ఆది వారాల్లో రెండేసి లక్షల వరకు భక్తులు రాగా, సోమవారం కాస్త తగ్గుముఖం పట్టారు.
నదీహారతికి రద్దీ
సరస్వతీఘాట్‌లో కాశీపండితులచే ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల తాకిడి పెరుగుతుంది. ఏడు గద్దెలపై తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నారు. రోజురోజుకు పరిసర ప్రాంతాల భక్తులు వీక్షించడానికి తరలి వస్తున్నారు. సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద భక్తులు దర్శించుకున్నారు. జ్ఞానతీర్థం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సాయంత్రం 8గంటల వరకు భక్తులు తాకిడి ఉంది.
నదికి నవరత్నమాల హారతి ఇస్తున్న కాళీపండితులు
ముక్తీశ్వరాలయంలోనూ బారులుదీరిన భక్తులు
హైకోర్టు జడ్జి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్, నాసిక్ త్రయంబకేశ్వర్ పీఠాధిపతి పూజలు
ఐదో రోజు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు

పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం

పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం

పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం

పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం

పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం

పుష్కర స్నానం.. ఆధ్యాత్మిక దర్శనం