
సమస్యల పరిష్కారానికి కృషి
భూపాలపల్లి రూరల్: డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని వేషాలపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రజలకు మంచి నీటి కోసం సంపు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాలనీవాసులకు రహదారి, విద్యుత్ లైన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్‌లు అద్దెకిచ్చిన, అమ్ముకున్నవారిపై విచారణ చేపట్టి వాటిని పేదలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మహేందర్, గురిజాల రవి, మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు భూపాలపల్లి సింగరేణి రెస్క్యూభవనంలో ఏర్పాటు చేసిన దుర్గామాత దేవాలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, అంబాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు