
వీవీఐపీలు వస్తే ఎలా?
● గర్భగుడిలో పోలీసుల రిహార్సల్స్
కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజులు మిగిలి ఉండడంతో సీఎం స్థాయి నాయకులు, వీవీఐపీలు, వీఐపీలు, సినీనటులు తరలి రానుండడంతో అకస్మాత్తుగా పోలీసులు సోమవారం సాయంత్రం దర్శనాలు నిలిపి రిహార్సల్స్ చేశారు. ఎలా తీసుకు వెళ్లాలి, రూప్‌పార్టీలు ఎలా ఉండాలి, రాజగోపురం నుంచి ధ్వజస్తంభం వద్ద, మండపంలోకి ఎంత మందిని రానివ్వాలి, గర్భగుడిలో ఫోర్స్ ఎలా ఉండాలనే విషయమై రిహార్సల్స్ జరిగాయి. అరగంటకుపైగా దర్శనాలు నిలపడంతో క్యూలైన్‌లో దర్శనానికి నిరీక్షణ తప్పలేదు.