కాళేశ్వరం: మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, మహాలక్ష్మి పథకంతో అత్యధికంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కాళేశ్వరం తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో మహిళలతో కాళేశ్వరం బస్టాండ్ ప్రాంగణం అంతా కిక్కిరిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు సరిపడా రాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం బస్సులు లేక పిల్ల పాపలతో, వృద్ధులతో ఇబ్బందులు పడ్డారు.
సరిపడా బస్సులు లేక ఇబ్బందులు