
సామగ్రి పంపిణీ చేస్తున్న వెంకటరాణిసిద్ధు
భూపాలపల్లి: కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ వెంకటరాణిసిద్ధు సూచించారు. మున్సిపాలిటీలో పని చేసే కార్మికులు, డ్రైవర్లు, జవాన్లకు మంగళవారం పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆఫ్రాన్స్, కొబ్బరి నూనె డబ్బాలు, బెల్లం, సబ్సులు, టవల్స్, చీరలు, చేతి గ్లౌజులు, చెప్పులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు ముంజాల రవీందర్, జక్కం రవీందర్, నూనె రాజు, ముంజంపల్లి మురళీధర్, మేకల రజిత, చల్ల రేణుక పాల్గొన్నారు.