
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న టీఎంఆర్పీఎస్ నాయకులు
మొగుళ్లపల్లి: ఎస్సీ వర్గీకరణ, మహిళా బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 30న ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ కోరారు. సంఘం మండల అధ్యక్షుడు బండారి రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ, మహిళా బిల్లుకు చట్టబద్ధత కల్పించే వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని బీజేపీ హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చడం లేదన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బండారి రాజు, నాయకులు వేణు, వినయ్, లింగయ్య, రాజు, శ్రీనివాస్, జంపయ్య తదితరులు పాల్గోన్నారు.