
కళ్లద్దాలు అందజేస్తున్న కల్లెపు శోభ
భూపాలపల్లి రూరల్: ప్రజల కంటిచూపు సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంటివెలుగు శిబిరాలను గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ కళ్లెపు శోభ సూచించారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. వైద్య సేవలు, కంటిపరీక్షల తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన తాగునీరు. టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యబృందాలు ఎప్పటికప్పుడు తమ వద్ద ఉన్న రీడింగ్ గ్లాసుల స్టాక్ వివరాలు పర్యవేక్షించాలని చెప్పారు. స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ దృష్టి లోపం సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి వారంలో ఐదు రోజులపాటు కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతిరోజు శిబిరంలో 120నుంచి 150మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్ కుమార్, సర్పంచ్ మామిడి మొండయ్య, ఎంపీటీసీ పరుపాటి మహిపాల్ రెడ్డి, సీహెచ్‌ఓ రాజయ్య, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ కల్లెపు శోభ