● డీఈ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ ఆర్టిజన్, అన్‌మ్యాన్‌డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఘన్‌పూర్‌లోని ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. జేఏసీ డివిజన్ చైర్మన్ పాశం రాజు, కోకన్వీనర్లు చెరిపెల్లి సురేష్, బదావత్ లక్ష్మణ్, ఉబ్బని వెంకన్న మాట్లాడారు.. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలో ఆర్టిజన్, అన్‌మ్యాన్‌డ్ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికుల సంఘం నాయకులు సురేష్, సరిత, డాన్ సురేష్, రమ్య, లత , షేక్ బాబా, రాజేందర్, సోమన్న, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


