ముగిసిన నామినేషన్ల పర్వం
జనగామ రూరల్/స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పురపాలికల్లో నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మూడు రోజుల్లో కలిపి జనగామలో 292.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 181 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి 100 నామినేషన్లు, బీఆర్‌ఎస్ 82, బీజేపీ 45, ఇండిపెండెంట్ 42 రాగా సీపీఎం 5, సీపీఐ 1, బీఎస్పీ 1, ఏఐఎఫ్‌బీ 6, ఇతరులు ఆరుగురు నామినేషన్ వేశారు. దంపతులు చిన్న పిల్లలతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్ వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సంబంధించిన బీ పామ్‌లు అందించడానికి అవసమైన ఆథరైజుడ్ ఫామ్ అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌కు స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందజేశారు.
నేడు స్క్రూటినీ..
నామినేషన్లను నేడు(శనివారం) స్క్రూటినీ చేయనున్నారు. వార్డుల వారీగా నామినేషన్లను పరిశీలించి ఒకటి, రెండు సెట్లను వేరు చేయనున్నారు. సాయంత్రం వరకు స్క్రూటినీ పూర్తి చేసి.. తుది జాబితాను వెలువరిస్తారు.


