పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

Jan 31 2026 7:13 AM | Updated on Jan 31 2026 7:13 AM

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

జనగామ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ అబ్జర్వర్‌ ఎ.నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సాధారణ అబ్జర్వర్‌గా నియమితులైన తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఎ.నర్సింహారెడ్డి శుక్రవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌తో సమావేశం అయ్యారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను అబ్జర్వర్‌కు కలెక్టర్‌ వివరించారు. అనంతరం నర్సింహరెడ్డి జనగామ ధర్మకంచ ప్రభుత్వ పాఠశాల, వీవర్స్‌ కాలనీ డగ్లస్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పింకేష్‌ కుమార్‌, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, హౌజింగ్‌ పీడీ మాతృనాయక్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ వివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబందనలకు లోబడి ర్యాలీలకు, వాహనాలకు, మైక్‌, ప్రచార సామగ్రి ముద్రణ అనుమతులలో నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ తప్పనిసరిగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకులు ఎస్‌.జయశ్రీ, జెడ్పీ సీఈఓ మాధురి షా, జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్లు మహేశ్వర్‌ రెడ్డి, రాధాకృష్ట, హౌసింగ్‌ పీడీ కోదండరామ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సాధారణ పరిశీలకుడు

నర్సింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement