భూముల రీ సర్వే
బచ్చన్నపేట: భూముల రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. భూముల రీ సర్వే కోసం కొడవటూరు గ్రామం ఎంపికై నట్లు తెలిపారు. గ్రామ హద్దులు, సర్వే నంబర్లను సర్వేయర్ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో కలిసి సర్వే చేయాలని అన్నారు. సర్వే చేసే సమయంలో పాటించే నియమాలు, పద్ధతులు అధికారులకు వివరించారు. దశల వారిగా మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్వేయర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శంకర్, ఆర్‌ఐ మున్నావర్, ఏడీ, సర్వేయర్ నర్మద, జూనియర్ అసిస్టెంట్ యాకన్న, జీపీఓ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్


