బుగులు వెంకన్న హుండీ ఆదాయం రూ.7.77లక్షలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.7.77.265 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు తెలిపారు. మంగళవారం ఉదయం 105 రోజులకు సంబంధించిన హుండీలను భువనగిరి దేవాదాయ శాఖ అధికారి నిఖిల్ సమక్షంలో మల్కాపూర్ ఇండియన్ బ్యాంకు అధికారులు, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి బాధ్యులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. ఆదాయంతో పాటు అమెరికాకు చెందిన రెండు డాలర్లు, ఆస్ట్రేలియాకు చెందిన ఒక డాలరు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మోహన్, వీరన్న, మల్లికార్జున్, కృష్ణ, హరిశంకర్, వసంత తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల భవనం పనుల పరిశీలన
జనగామ రూరల్: కోర్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నాణ్యత, తరగతి గదుల ఏర్పాటు, భద్రతా ప్రమాణాలు, తాగునీరు–శానిటేషన్ సదుపాయాలు, విద్యుత్ వసతులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రజిత, ఎంపీడీఓ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
జనగామ: ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్‌ఈ) సీహెచ్.సంపత్‌రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పెంబర్తి సెక్షన్ సిబ్బందితో కలసి మంగళవారం ప్రజాబాట కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులతో కలసి ఆయన పాల్గొని స్థానికులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓవర్ లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు, తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్తవి వేసి లోఓల్టేజ్ సమస్య లేకుండా పరిష్కారిస్తామన్నారు. నూతన గృహ అవసరాలకు లైన్లు వేసుకుని ఎస్టిమేట్లకు డబ్బులు చెల్లించాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో సెక్షన్ ఏఈ కనకయ్య, లైన్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రచారి, లైన్‌మెన్ జయరాజు, భాస్కర్, కమలాకర్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
బుగులు వెంకన్న హుండీ ఆదాయం రూ.7.77లక్షలు
బుగులు వెంకన్న హుండీ ఆదాయం రూ.7.77లక్షలు


