లక్కీ చాన్స్..
● ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో సర్పంచ్‌గా అవకాశం
జనగామ రూరల్: గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హులు కాదనే నింబధన ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తి వేయడంతో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. దీంతో మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కర్రె పర్శరాములు తనకు ముగ్గురు పిల్లలు ఉన్నా..ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసి గెలుపొందాడు. మొదటిసారిగా సర్పంచ్‌గా అవకాశం రావడంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, ముఖ్యంగా అన్ని వార్డుల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, మంచి నీటి వసతికి మొదటగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.


