రాలని ఓట్లు
అధిష్టానం సీరియస్
జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో పార్టీ అధిష్టానాలు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఓటమి చెందిన గ్రామాలకు సంబంధించి గెలుపు తారుమారు అయిన కారణాలపై సమగ్రంగా తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీలను నియమించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయా కమిటీల ద్వారా గ్రౌండ్ లెవల్ పరిస్థితులు, అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో జరిగిన లోపాలపై నివేదికలు తెప్పించుకొని భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నిర్ణయాలు తీసుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రాలని ఓట్లు


