ముగిసిన తుది విడత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తుది విడత ప్రచారం

Dec 16 2025 4:53 AM | Updated on Dec 16 2025 4:53 AM

ముగిస

ముగిసిన తుది విడత ప్రచారం

జనగామ: జిల్లాలో మూడో విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆధ్వర్యంలో నేడు (మంగ వారం) మండల పరిషత్‌ కార్యాలయాల ప్రాంగణాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

మొత్తం 1,18,870 ఓట్లు

జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో మూడో విడత పోలింగ్‌ జరగనుంది. మూడు మండలాల్లో 91 జీపీల పరిధిలో 3 సర్పంచ్‌, వార్డుల పరిధిలో 108 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 88 జీపీల్లో 266 మంది సర్పంచ్‌, 800 వార్డుల్లో 1,668 వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు. పురుషులు 59,001, మహిళలు 59,866 అదర్స్‌ 3 కలుపుకుని మొత్తంగా 1,18,870 ఓట్లు ఉన్నాయి.

మూడు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు

ఈ నెల 17వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో జరుగనున్న పోలింగ్‌ కోసం నేడు ఎలక్షన్‌ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు మండలాల పరిధిలో సామగ్రి పంపిణీ, పోలింగ్‌ ముగిసిన తర్వాత రిసీవ్‌ చేసుకునేందుకు సాంఘిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయగా, మండలాల పరిధిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 800 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో పీఓ 597, ఓపీఓ 597 మొత్తంగా 1,194 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్‌ సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు 40 బస్సుల వరకు సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రూట్ల వారీగా పటిష్ట బందోబస్తు చేపట్టారు.

పోలీసుల ముందస్తు నిఘా

పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత, చివరి సర్పంచ్‌ ఎలక్షన్‌ నేపధ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా.. అన్నట్టు ఎలక్షన్లలో పోటీ పడుతుండడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నిఘా వేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక ఫోకస్‌ సారిస్తూ, ఇంటలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గాలు కావడంతో పోలీసులకు కొంతమేర సవాల్‌ అని చెప్పుకోవచ్చు. సర్పంచ్‌ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని కాంగ్రెస్‌ జోరుగా ప్రచారం చేయగా, అత్యధిక స్థానాల్లో పాగా వేసి..అధికార పక్షానికి జలక్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది.

మూడో విడతకు సిద్ధం..

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

జిల్లాలో మొదటి, రెండవ విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లే, మూడవ విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి విజయవంతంగా ముగించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. సోమవారం 17వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్న దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఎలక్షన్‌పై కలెక్టర్‌ గూగుల్‌ మీట్‌ ద్వారా అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌, జెడ్పీ సీఈఓ, ఆర్డీఓలు, డీఆర్డీఓ, డీఎస్‌డీఓ, మండల స్పెషల్‌ అధికారులుతో సమీక్ష నిర్వహించారు. ఎలక్షన్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, పోలింగ్‌, కౌంటింగ్‌ తదితర వాటిపై పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో మెటీరియల్‌ పంపిణీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. పోలింగ్‌ నిర్వహణకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఆహారం విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కౌంటింగ్‌ సమయంలో వేగవంతంగా జరిగేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక పూర్తి చేయాలన్నారు.

మూడు మండలాల పరిధిలోని మొత్తం జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలు

జీపీ

వార్డులు

మొత్తం ఓటర్లు

నేడు ఎలక్షన్‌ సామగ్రి పంపిణీ

పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఏర్పాట్లు

బరిలో 266 సర్పంచ్‌, 1,668 మంది వార్డు అభ్యర్థులు

రేపు పోలింగ్‌

91

800

1,18,870

మూడు మండలాల పరిధిలోని జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలు

మండలం జీపీ వార్డులు మొత్తం పోలింగ్‌

ఓటర్లు కేంద్రాలు

దేవరుప్పుల 32 274 37,333 274

పాలకుర్తి 38 336 52,865 336

కొడకండ్ల 21 190 28,672 190

మూగబోయిన మైక్‌లు

ఆయా గ్రామాల్లో ప్రలోభాల హడావుడి

జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు సర్పంచ్‌ ఎన్నికల ప్రచారం ముగియడంతో బహిరంగ రాజకీయ హడావుడి తగ్గినట్టే కనిపిస్తున్నా, ప్రలోభాల పర్వం ఉత్కంఠను రేపుతున్నాయి. మద్యం దుకాణాలను మూసివేసినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మైకుల ప్రచారం ఆగిపోవడంతో ప్రధాన పార్టీ లు, స్వతంత్ర అభ్యర్థులు రహస్య వ్యూహాలకు పదును పెట్టినట్లు సమాచారం. ఓట్లు జారిపోకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ నగదు, గిఫ్టుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 17న పోలింగ్‌ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ముగిసిన తుది విడత ప్రచారం1
1/4

ముగిసిన తుది విడత ప్రచారం

ముగిసిన తుది విడత ప్రచారం2
2/4

ముగిసిన తుది విడత ప్రచారం

ముగిసిన తుది విడత ప్రచారం3
3/4

ముగిసిన తుది విడత ప్రచారం

ముగిసిన తుది విడత ప్రచారం4
4/4

ముగిసిన తుది విడత ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement