పెద్ద కొరివి దయ్యం ఎమ్మెల్యే పల్లా
స్టేషన్‌ఘన్‌పూర్: కేసీఆర్ చుట్టూ కొరివిదయ్యాలు చేరాయని, వాటి వల్లనే బీఆర్‌ఎస్ పార్టీ భ్రష్టు పడుతుందని కల్వకుంట్ల కవిత సాక్ష్యాలతో సహా పలు మార్లు విమర్శలు చేసిందని, అందులో పెద్ద కొరివిదయ్యం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అని మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. కేసీఆర్ పంతన చేరి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడని, అందుకే కవిత దూరమైందని, కేటీఆర్, హరీశ్‌రావు మఽధ్య సైతం గ్యాప్ వచ్చిందన్నారు. కేసీఆర్ పక్కన చేరి వందల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఘన్‌పూర్ నియోజకవర్గానికి వచ్చి సుద్దపూసలా మాట్లాడుతున్నాడన్నా రు. జీపీ ఎన్నికల ప్రచారంలో పల్లా, డాక్టర్ రాజయ్య నాపై తీవ్ర స్థాయిలో దూషణలు, దిగజారుడు విమర్శలు చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అభివృద్దిని ప్రజలు గమనించి అత్యధిక పంచాయతీలు గెలిపించారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజయ్య ప్రచారం చేస్తే ఓట్లు రావని ఎమ్మెల్యే పల్లా పరోక్షంగా నియోజకవర్గంలో ప్రచారం చేశారని, ఇదంతా రాజయ్యను జీరో చేయాలనే ప్రణాళిక అని ఆరోపించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, జగదీష్‌చందర్‌రెడ్డి, మంచాల ఎల్లయ్య, అంబటి కిషన్‌రాజ్, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజయ్యను జీరో చేయాలని చూస్తున్నాడు..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణ


