అవాంఛనీయ ఘటనలు జరగొద్దు
తరిగొప్పుల: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీంశర్మతో కలసి మండలకేంద్రం, నర్సాపూర్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు.
పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు
జనగామ:వరంగల్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ,ఏసీపీలు పండేరీ చేతన నితిన్, నర్సయ్య, భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ,ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నర్మెట, జనగామ,బచ్చన్నపేట మండలాల్లో సీపీ పర్యటించి పోలింగ్ తీరు తెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించారు.


