పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ
జనగామ: జనగామ నియోజకవర్గంలో రెండో విడత ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీతిసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ జనగామ జిల్లాలోని శామీర్‌పేట, బచ్చన్నపేట, నర్మెట, మచ్చుపహాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటతో పాటు ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులపై సీపీ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సీపీ వెంట డీసీపీలు కుమార్, రాజమహేంద్రనాయక్, ఏసీపీ చైతన్య, ఏసీపీ నర్సయ్య, రమణ బాబుతో పాటు స్థానిక ఇన్‌న్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ


