ఎన్నికల నియమావళిని పాటించాలి
పాలకుర్తి టౌన్: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటించాలని డీసీపీ రాజహేంద్రనాయక్ సూచించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, చెన్నూరులో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రతాల స్వీకరణ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సైలు దూలం పవన్‌కుమార్, మేకల లింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి
దేవరుప్పుల: రాజకీయాలకతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీసీపీ రాజామహేంద్రనాయక్ సూచించారు. మండలంలోని కోలుకొండ, మాధాపురం, ధర్మాపురం క్లస్టర్‌లో కొనసాగిన సర్పంచ్, వార్డు నామినేషన్‌ల కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి, స్థానిక ఎస్సై ఊర సృజన్‌కుమార్ ఉన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్


