ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి

Dec 2 2025 7:38 AM | Updated on Dec 2 2025 7:38 AM

ప్రశా

ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి

డీసీపీ రాజమహేంద్రనాయక్‌

బచ్చన్నపేట: స్థానిక ఎన్నికల నామినేషన్లను ప్రశాంతంగా వేయాలని, క్లస్టర్‌ కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడరాదని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు పోచన్నపేట, కొడవటూర్‌ గ్రామాల్లోని నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నామినేషన్‌ వేసే అభ్యర్థితో మరో ముగ్గురిని మాత్రమే అనుమతించాలని, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌లను తొందరగా స్వీకరించి బయటకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే అబ్దుల్‌ హమీద్‌, కానిస్టేబుళ్లు పలువురు పాల్గొన్నారు.

నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి

బచ్చన్నపేట: స్థానిక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగాలని ఎన్నికల జిల్లా జనరల్‌ అబ్జర్వర్‌ రవికిరణ్‌ అన్నారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్‌ బాషాతో కలిసి బచ్చన్నపేట, పోచన్నపేట, గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఇంతవరకు వచ్చిన నామినేషన్‌ వివరాలు, టీ పోల్‌ ఎంట్రీ ప్రక్రియ, ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రామానుజాచారి, ఎంపీడీఓ మమతాబాయ్‌, ఎస్సై అబ్దుల్‌ హమీద్‌, ఆర్‌ఐలు వంశీ కృష్ణ, మునవర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

‘బాండ్‌’ ప్రచారం

రఘునాథపల్లి: అవకాశం ఇచ్చి చూడండి.. కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్‌, ఇతర పనులు చేసి పెడతామంటూ సర్పంచ్‌ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారానికి తెరలేపారు. సోమవారం మండలంలోని ఇబ్రహీంపూర్‌లో గౌడ కుల సంఘం వారు చిట్టీ నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన బీజేపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి దొరగొల్ల రవి ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్‌తో కులస్తులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. సర్పంచ్‌గా గెలిపించిన రెండు నెలల్లో సొంత డబ్బులతో గౌడ సంఘం భవనం నిర్మించి ఇస్తానని ఏకంగా బాండ్‌ రాసిఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఫతేషాపూర్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు అక్కనపల్లి సుజాత, అక్కనపల్లి మాధవి వేర్వేరుగా గ్రామంలో చిట్టీ నిర్వహించుకుంటున్న ముదిరాజ్‌ కులస్తులకు వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు.

రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక

జఫర్‌గఢ్‌: మండలంలోని తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఇటీవల జనగామ జిల్లాకేంద్రంలో జరిగిన సైన్స్‌ఫెయిర్‌లో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆధునిక ఎద్దుల బండి ఎగ్జిబిట్స్‌ ప్రదర్శించారు. దీంతో విద్యార్థుల ప్రతిభకను గుర్తించి రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారని హెచ్‌ఎం సదానందం తెలిపారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

ఆధార్‌ కేంద్రం పరిశీలన

జనగామ: జనగామ పట్టణంలోని ప్రభుత్వ ఆధార్‌ కేంద్రాన్ని మీసేవా గవర్నర్‌ టి. రవికిరణ్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధార్‌ సేవలను పరిశీలించి, సేవల ప్రమాణాలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్‌ వెంట ఈడీఎం గౌతమ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి
1
1/2

ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి

ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి
2
2/2

ప్రశాంతంగా నామినేషన్లు వేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement