కేసీఆర్ దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం
జనగామ: పదేళ్ల పాలనలో తెలంగాణను చక్కదిద్ది అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు తీసుకు వచ్చిన కేసీఆర్‌తోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్యలు అన్నారు. దీక్షాదివస్ పురస్కరించుకుని యశ్వంతాపూర్ బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 11 రోజుల పాటు చుక్క నీళ్లు కూడా తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. 14 సంవత్సరాల పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్య మ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. ఆమరణ నిరాహార దీక్ష సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలిచారన్నారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్‌తో కలిసి తిరిగే అదృష్టం తనకు లభించిందని ఎమ్మెల్యే పల్లా అన్నారు.


