మొదటి విడతకు రెడీ
జిల్లాలో ఓటర్ల వివరాలు
● 5 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
● 30 క్లస్టర్లుగా విభజన..
● 110జీపీలు, 1,024 వార్డులకు ఎన్నికలు
జనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27 (గురువారం) నుంచి అధికారికంగా ప్రారంభం కానుండగా, జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 మండలాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లా పరిధిలో 4,01,496 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,98,715, మహిళలు 2,02,963, ఇతరులు 8 మంది ఉన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాలఘణపురం మండలాల పరిధిలోని 110 గ్రామపంచాయతీలు, 1,024 వార్డుల్లో మొదటి విడత నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థంతో పాటు దూరభారాన్ని తగ్గించేందుకు మూడు నుంచి నాలుగు గ్రామాలను కలిపి మండలంలో క్లస్టర్లుగా విభజించి, ఒక్కో కేంద్రాల్లో స్టేజ్–1 ఆర్‌ఓ(ఏఆర్‌ఓతో కలిసి) నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత స్టేజ్–2 ఆర్‌ఓల పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రక్రియ జరుగనుంది. లింగాలఘణపురంలో (6క్లస్టర్లు), స్టేషన్‌ఘన్‌పూర్‌లో (6), చిల్పూరులో (4), రఘునాథపల్లి(7), జఫర్‌గఢ్(7) మొత్తంగా 30 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొదటి విడత నామినేషన్లను పురస్కరించుకుని బ్యాలెట్ బాక్స్, మెటీరియల్‌ను కలెక్టరేట్ స్ట్రాంగ్‌రూం నుంచి తరలించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు విస్తృతమైన ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ స్టేషన్లకు అదనపు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు కూడా నియమించనున్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ఏసీపీ భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టనున్నారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 2,534 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 100 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 757, 101–200 ఓటర్లు–1,089, 201–400 ఓటర్లు– 659, 401–650 ఓటర్లు–29, కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమర్థత కోసం ప్రతి విభాగానికి 13 మంది ప్రత్యేక నోడల్ అధికారులను కేటాయించారు. వారిలో పింకేశ్ కుమార్ (డీఈఓ, అదనపు కలెక్టర్), టి.వెంకట్‌రెడ్డి(డీఎల్‌పీఓ), జి.వి.ఎస్.గౌడ్ (డీటీఓ), మాధురి కృష్ణచంద్ర షా (జెడ్పీ సీఈఓ), ఎన్. రాణాప్రతాప్(ఫిషరీష్ ఆఫీసర్), పి.చిన్ని కోట్యా నాయక్ (సీపీఓ), కె.కోదండరాములు (డీసీఓ), బి.మాత్రునాయిక్ (హౌజింగ్ పీడీ), ఎ.నవీన్ (డీపీఓ), బి.పల్లవి (డీపీఆర్‌ఓ), ఒ.గౌతమ్‌రెడ్డి (ఈడీఎం), బి.నరేంద్ర (డీఎం), డి.సరిత (డిప్యూటీ సీఈఓ) ఉన్నారు.
కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో జీపీ ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం:
మండలం జీపీ వార్డులు పురుష మహిళా ఇతరులు మొత్తం పోలింగ్
ఓటర్లు ఓటర్లు కేంద్రాలు
చిల్పూరు 17 168 16,473 16,853 1 33,327 168
స్టేషన్‌ఘన్‌పూర్ 15 146 13,177 13,387 – 26,564 146
రఘునాథపల్లి 36 320 22,279 22,729 2 45,010 320
జఫర్‌గఢ్ 21 194 16,928 17,320 1 34,249 194
లిం.ఘణపురం 21 196 16,323 17,033 – 33,356 196
మొత్తం 110 1,024 85,180 87,322 4 1,72,506 1,024
జనగామ నియోజకవర్గం:
జనగామ 21 198 16,892 17,092 – 33,984 198
నర్మెట 17 148 10,121 10,396 – 20,517 148
తరిగొప్పుల 15 126 8,009 8,079 – 16,088 126
బచ్చన్నపేట 26 238 19,322 20,208 1 39,531 238
మొత్తం 79 710 54,344 55,775 1 1,10,120 710
పాలకుర్తి నియోజకవర్గం:
దేవరుప్పుల 32 274 18,610 18,723 – 37,333 274
పాలకుర్తి 38 336 26,189 26,675 1 52,865 336
కొడకండ్ల 21 190 14,202 14,468 2 28,672 190
మొత్తం 91 800 59,001 59,866 3 1,18,870 800
మొదటి విడతకు రెడీ


