వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

Nov 27 2025 6:23 AM | Updated on Nov 27 2025 6:25 AM

పాలకుర్తి టౌన్‌: శ్రీచండికా సమేత సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృత విశేష అభిషేకం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌ శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, మత్తగజం నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా ఐఏఎస్‌ నిఖిల

జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం జనగామ జిల్లా ఎలక్షన్‌ జనరల్‌ అబ్జర్వర్‌గా డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌్‌స్టిట్యూట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఐఏఎస్‌ అధికారి కె.నిఖిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఖిలకు లింగాలఘణపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.భగత్‌ను లైజన్‌ ఆఫీసర్‌గా నియమించారు.

రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

జనగామ రూరల్‌: విద్యార్థులకు రాజ్యాంగంపై తప్పనిసరిగా అవగాహాన ఉండాలని సీనియర్‌ సివిల్‌ జెడ్జి ఈ. సుచరిత అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్‌ లా సంవిధాన్‌ డే సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు పట్టణంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఎం.రవీంద్ర, ప్రధానో పాధ్యాయుడు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

అంతర్జాతీయ సమ్మేళనానికి నర్మెట విద్యార్థులు

నర్మెట: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బాలసాహిత్యభేరి పేరుతో అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం కార్యక్రమానికి ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం నీలం వేణు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తానా ప్రపంచ సాహిత్య వేదిక నవంబర్‌ 30న నిర్వహిస్తున్న సమ్మేళనానికి పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎం.అభినిష, పదో తరగతి విద్యార్థిని ఎం.శ్రుతి ఎంపికై నట్లు పేర్కొన్నారు.

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం1
1/3

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం2
2/3

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం3
3/3

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement