వైజ్ఞానిక పండుగకు వేళాయె
సైన్స్ ఫెయిర్‌కు ఏర్పాట్లు పూర్తి
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించి నూతన ఆవిష్కరణలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 27 నుంచి రిజిస్ట్రేషనప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌తో పాటు ఇన్‌స్పైర్ మనక్ ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు
జిల్లా సైన్‌న్స్ ఎగ్జిబిషన్‌కు ప్రదర్శన థీమ్ ‘వికసిత్, ఆత్మనిర్బర్ భారత్ కోసం..’ అనే ప్రధాన అంశంలో భాగంగా స్వయం సమృద్ధి భారత దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ప్రధాన అంశంగా ఎంపిక చేశారు. ఇందులో ఏడు ఉప అంశాలైన సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్థాల నిర్వహణ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్, హరితశక్తి(పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదభరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉంటాయి.
రెండు రోజుల పాటు ప్రదర్శనలు
ఎగ్జిబిషన్‌కు 27న సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టులు, పాఠశాల పేర్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. రెండో రోజు ప్రదర్శనలు ప్రారంభంతో పాటు ప్రాజెక్టుల ప్రదర్శనతో పాటు సాయంత్రం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు. 28 తేదీల్లో జనగామ, లింగాల ఘణపురం, రఘునాథపల్లి, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల విద్యార్థులు ప్రదర్శనలు తిలకిస్తారు. 29న స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, చిల్పూర్ మండలాలు ఉంటాయి.
నిబంధనలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి సైన్స్ ఎగ్జిబిషన్‌ను 333 ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్‌లో జూనియర్ విభాగంలో 6 నుంచి 8వ తరగతి వరకు, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఉప అంశానికి ఒకరు చొప్పున ప్రాజెక్టులను ప్రదర్శించాలి. ఒక పాఠశాల నుంచి 5 మాత్రమే ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ పాల్గొనాలి.
జిల్లా ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనలు
జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శన (2024–25)ను కూడా జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్(2025–26)తో పాటు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇన్‌స్పైర్ (2024–25)లో జిల్లాస్థాయికి ఎంపికై న 77 ( ప్రాజెక్టులు) మంది విద్యార్థులు సైతం ఇందులో పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థుల ఖాతాల్లో రూ.పదివేల చొప్పున డబ్బులు జమ చేస్తారు.
ప్రధాన అంశంతో పాటు
ఏడు ఉప అంశాల్లో 333 ప్రదర్శనలు
ఇన్‌స్పైర్ మనక్ ఎగ్జిబిట్స్ 77
జిల్లా కేంద్రంలోని సాన్ మారియా
పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా సైన్స్ ఫెయిర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అధికారుల సమన్వయంతో 333 అవిష్కరణలు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు 77 మనక్ ఇన్‌స్పైర్ ప్రాజెక్ట్‌లు ఉంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నూతన అవిష్కరణలకు చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.
– పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్, డీఈఓ
నూతన అవిష్కరణకు విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీసే గొప్ప అవకాశం. ప్రతీ ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి పాఠశాల నుంచి 5 ఎగ్జిబిట్లు ప్రదర్శించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపించాలి.
– శ్రీనివాస్‌రావు, ఏఎంఓ
వైజ్ఞానిక పండుగకు వేళాయె


