పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
జనగామ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11, 14, 17న మూడు విడతల్లో పంచాయతీ ఎలక్షన పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు టి–పోల్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనంతరం కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో జరిగిన శిక్షణలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని మాట్లాడారు..ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి పాత్ర కీలకమైందని, విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, జెడ్పీ సీఈఓ మాధురి షా, డీఆర్డీఓ వసంత, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ఎన్నికల సంఘం
కమిషనర్ రాణీ కుముదిని


