ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్ షాలోమ్ అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ.. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు శ్రీకాంత్, సతీశ్, ఏపీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్


