‘నజరానా’ నారాజ్!
● ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షలు
ఒట్టిదేనా?
● ఇప్పటికీ ఒక్క రూపాయీ ఇవ్వలేదంటూ ప్రజల చర్చ
లింగాలఘణపురం: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం గత ఎన్ని కల సమయంలో రూ.10లక్షల నజరానా ప్రకటించి నేటికీ ఏ ఒక్క పంచాయతీకి కూడా అందజేయలేదు. ఎన్నోసార్లు ఆయా గ్రామాల ఏకగ్రీవ సర్పంచ్‌లు అధికారులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఎన్నికలొచ్చేసరికి గ్రామాల్లో చర్చమొదలైంది. ‘గప్పుడే చెప్పిండ్రు..అంతా ఒట్టిదే అయ్యింది.. ఇంతవరకు ఏ ఒక్క పంచాయతీకి ఒక్కపైసా రాలే..గట్లనే అంటరు ఏం ఇయ్యరు..’అంటూ చ ర్చించుకుంటున్నారు. మండలంలో 21 పంచాయతీలకు గాను సిరిపురం, ఏనెబావి, మంథోనిగూడెం, నేలపోగుల ఏకగ్రీవం కావడంతో ఎంతో ఉత్సాహంతో సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి పాటు పడగా నజరానా రాకపోవడంతో నిరాశలో పడ్డారు.


